ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ 2026లో తొలి సేల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సేల్ నిర్వహించనుంది. జనవరి 17 నుంచి సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే సేల్ ఎప్పుడు ముగుస్తున్నదని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే ముందు ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
2026 రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఏయే ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉంటాయనే డీటెయిల్స్ మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి వివరాలను ఫ్లిప్‌కార్ట్ త్వరలో పంచుకోనుంది. సేల్ డేట్ దగ్గర పడే కొద్దీ ఆఫర్ల వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే సేల్‌కు సంబంధించి ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ వచ్చేసింది.
Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఏంటమ్మా ఈ అరాచకం.. మరింత డోస్ పెంచబోతున్నావా?
ఫ్లిప్‌కార్ట్ తమ సేల్‌లలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్స్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు, వాషింగ్‌మెషీన్లు సహా ఫ్యాషన్, గృహోపకరణాలపై ఆఫర్లు పెడుతుంటుంది. ఈసారి కూడా వీటిపైనే ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉండనున్నాయి. అవసరం ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు సిద్ధంగా ఉండండి. బిగ్ బిలియన్ డేస్ సేల్, బిగ్ సేవింగ్ డేస్ సేల్, బిగ్ దీపావళి సేల్, ఎండ్-ఆఫ్-సీజన్ సేల్, షాపింగ్ ఉత్సవ్ సేల్ లాంటివి ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.