NTV Telugu Site icon

Bharatiya Antariksh Station : 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం!

Bharatiya Antariksh Station

Bharatiya Antariksh Station

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇస్రో ఇప్పటికే చంద్రుడిపైకి మూడు మిషన్లను పంపింది. చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్, రోవర్‌ను విజయవంతంగా దింపింది. దీంతో పాటు వీనస్ మిషన్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇస్రో వీటికి సంబంధించిన పనులను ప్రారంభించనుంది.

READ MORE: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు

ఇదిలా ఉండగా.. సోమనాథ్ గతంలో మాట్లాడుతూ.. “ప్రస్తుతమున్న లాంఛర్‌ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.” అని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు అంతరిక్ష కేంద్రం దోహదపడేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. మొదటిది అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు. రెండవ స్టేషన్ చైనాకు చెందిన చెందినది. త్వరలో భారత్ కి కూడా అంతరిక్ష కేంద్రం ఉంటుంది.

Show comments