భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.