Amazon Top Deals : రిపబ్లిక్ డే వేడుకుల సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన మొదటి భారీ సేల్ ఈవెంట్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ను ప్రారంభించింది. జనవరి 16 నుండి ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లతో పాటు అమెజాన్ సొంత బ్రాండ్లయిన ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలనుకున్నా లేదా మీ టీవీని స్మార్ట్ టీవీగా మార్చాలనుకున్నా ఇదే సరైన సమయం.
UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
ఈ సేల్‌లో ధరల తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్బిఐ (SBI) క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రైమ్ మెంబర్లలకు తమ కార్ట్ విలువపై గరిష్టంగా 12.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా.. నాన్-ప్రైమ్ మెంబర్లు 10 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఇకపోతే.. మీరు చేసే ఖర్చును బట్టి అదనంగా రూ. 500 నుండి రూ. 1,000 వరకు వన్-టైమ్ బోనస్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
అలెక్సా (Alexa) సాయంతో పనిచేసే ఈ స్మార్ట్ డివైజ్‌లు ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. డిస్ప్లేతో కూడిన Echo Show 5 స్మార్ట్ స్పీకర్ అసలు ధర రూ. 11,999 కాగా, సేల్‌లో కేవలం రూ. 8,999కే అందుబాటులో ఉంది. ఇది వీడియో కాల్స్ , కంటెంట్ చూడటానికి చాలా బాగుంటుంది. అద్భుతమైన ఆడియో నాణ్యత కలిగిన Amazon Echo (4th Gen) స్పీకర్ ధర రూ. 9,999 నుండి రూ. 6,999కి తగ్గింది. బెడ్‌సైడ్ క్లాక్గా ఉపయోగపడే Echo Spot కొత్త డివైజ్ ఇప్పుడు రూ. 7,499కే లభిస్తోంది.
సాధారణ టీవీని స్మార్ట్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చే ఫైర్ టీవీ స్టిక్స్‌పై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. హై-డెఫినిషన్ స్ట్రీమింగ్ అనుభవాన్ని ఇచ్చే Fire TV Stick 4K Select స్టిక్ ధర రూ. 5,499 నుండి రూ. 3,999కి తగ్గించబడింది. మరింత వేగవంతమైన పనితీరును ఇచ్చే Fire TV Stick 4K Plus ప్లస్ వెర్షన్ ఇప్పుడు కేవలం రూ. 4,999కే అందుబాటులో ఉంది.
ప్రీమియం స్ట్రీమింగ్ అనుభవం కోసం చూసే వారికి Fire TV Cube డివైజ్ రూ. 12,999కి లభిస్తుంది (అసలు ధర రూ. 13,999). అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ద్వారా తక్కువ ధరకే స్మార్ట్ గ్యాడ్జెట్లను సొంతం చేసుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా ఎకో షో , ఫైర్ టీవీ స్టిక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ బ్యాంక్ ఆఫర్లు మరింత మేలు చేస్తాయి. స్టాక్ ముగిసేలోపే మీ పర్చేజ్ ప్లాన్ చేసుకోండి.
Instagram New Feature: అదిరిపోయే ఫీచర్ తీసుకువచ్చిన ఇన్ స్టా..!