పసి బిడ్డల పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. పాపం.. పుణ్యం ఎరుగని చిన్నారుల చేష్టలు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి చిన్నారులను ఎవరైనా ముద్దాడుతుంటారు. ఎత్తుకుంటారు. వారితో గడుపుతుంటారు. ఇలాంటి సంఘటనే యూపీలో జరిగింది. ఓ బుడ్డోడుతో సీఎం యోగి ఆహ్లాదకరంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం.. పైలట్ సంఘాలకు దర్యాప్తు సంస్థ హితవు
గోరఖ్‌పూర్‌లో కిచ్డి పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పసిబిడ్డతో యోగి సంభాషించారు. ఏం కావాలని చిన్నారిని అడిగారు.. వెంటనే తడువు చేయకుండా యోగి చెవి దగ్గరకు వెళ్లి ‘చిప్స్’ కావాలని కోరాడు. బుడ్డోడు అడిగిన వింతైన కోర్కెతో యోగి ఆదిత్యనాథ్ పడి పడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ చేస్తోంది. చిన్నారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.