Airtel Offers: భారత్‌లోని తమ కస్టమర్లకు ఎయిర్టెల్ మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్టెల్ వినియోగదారులు Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఈ సబ్స్క్రిప్షన్ ధర సుమారు రూ.4,000 కాగా, ఎయిర్టెల్ ఈ సేవను తన వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. కాగా, ఇటీవలే ఎయిర్టెల్ తన కస్టమర్లకు Perplexity Proను కూడా ఏడాది పాటు ఫ్రీగా అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు Adobe Express Premiumను కూడా ఉచితంగా ఇవ్వడంతో AI ఆధారిత డిజైన్, క్రియేటివ్ టూల్స్‌ను అందరికి అందుబాటులోకి తీసుకువస్తోంది.
Read Also: Varanasi : వారణాసి లో భారీ హోర్డింగ్స్.. రాజమౌళి పనేనంటూ కామెంట్స్..
ఎవరికెవరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది?
* ఈ ఆఫర్ కేవలం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే కాకుండా, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ / వై-ఫై, డీటిహెచ్ సేవలను ఉపయోగిస్తున్న అన్ని ఎయిర్టెల్ కస్టమర్లకూ అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ కనెక్షన్ ఉన్నవారెవరైనా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
Adobe Express Premium ఎలా పొందాలి?
* అయితే, మీ ఫోన్లో Airtel Thanks App డౌన్లోడ్ చేసుకోండి
* మీ ఎయిర్టెల్ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వండి
* యాప్‌లోని Rewards / Benefits సెక్షన్‌కి వెళ్లండి
* అక్కడ కనిపించే Adobe Express Premium – 1 Year Free ఆఫర్‌ను క్లెయిమ్ చేయండి
* Adobe Express Premium లో ఏమేమి ఫీచర్లు ఉన్నాయి?
* Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులకు ఎన్నో ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.
* వేల సంఖ్యలో ప్రొఫెషనల్ డిజైన్ టెంప్లేట్స్
* భారతీయ పండుగలు, పెళ్లిళ్లు, లోకల్ బిజినెస్‌ల కోసం ప్రత్యేక టెంప్లేట్స్
* AI ఆధారిత బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్
* కస్టమ్ ఇమేజ్ జనరేషన్
* వన్-ట్యాప్ వీడియో ఎడిటింగ్
* ప్రీమియం Adobe Stock అసెట్స్
* 30,000+ ప్రొఫెషనల్ ఫాంట్స్
* 100GB క్లౌడ్ స్టోరేజ్
* ఆటో క్యాప్షన్స్, ఇన్స్టంట్ రీసైజ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు
* నెలకు 250 AI జనరేటెడ్ ఎడిట్స్ చేసుకునే అవకాశం
Read Also: T20 World Cup 2026: సూర్య, గంభీర్‌కు అదే పెద్ద తలనొప్పి.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే, Adobe Express ఇంగ్లిష్తో పాటు హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం వల్ల భారతీయ వినియోగదారులకు మరింత సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ డెస్క్‌టాప్ బ్రౌజర్లు, స్మార్ట్ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.
ఎవరికీ ఉపయోగపడుతుంది?
ఈ ఉచిత సబ్స్క్రిప్షన్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, స్టార్టప్‌లు, బ్రాండ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగాల్లో ఉన్నవారికి ఎంతో లాభపడే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా కంటెంట్, ప్రచార కార్యక్రమాల కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అయితే, Perplexity Pro, Adobe Express Premium లాంటి విలువైన సబ్స్క్రిప్షన్లను ఉచితంగా అందించడం వల్ల ప్రస్తుతం ఎయిర్టెల్ నెట్వర్క్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఇక, ఈ రెండు సేవలు ఒక సంవత్సరం పాటు మాత్రమే ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వీటిని కొనసాగించాలని అనుకుంటే మాత్రం చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది.