Aira Rawat: భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. మైదానంలో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తుంటే, కెమెరా కళ్లు అప్పుడప్పుడు గ్యాలరీలో ఉన్న అందమైన ముఖాలను వెతుకుతుంటాయి. ఇటీవల జరిగిన ICC T20 ప్రపంచ కప్లో India vs USA మ్యాచ్ సందర్భంగా సరిగ్గా ఇదే జరిగింది. అయితే, ఈసారి వైరల్ అయిన అమ్మాయి కథ కాస్త భిన్నంగా, నెటిజన్లను అయోమయంలో పడేసేలా ఉంది. ఇంతకీ ఆ బ్యూటీ పేరు ఏంటో తెలుసా.. ఐరా రావత్ (Airaawat). ఆమె కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Team India History: వరుసగా 16 విజయాలు.. ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర!
ఒకే రాత్రిలో 3 వేల నుంచి 3.5 లక్షల ఫాలోవర్లు!
నీలిరంగు టీ షర్ట్, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో మెరిసిన ఐరా ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. మ్యాచ్ ముగిసే సమయానికి ఆమె ఫోటోలు, క్లిప్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం స్టార్ట్ చేశాయి. నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఆమె ఫాలోవర్ల సంఖ్య కేవలం 3,000 మాత్రమే, ఆ మ్యాచ్ పూర్తి అయిన మరుసటి రోజు ఉదయానికల్లా ఆ సంఖ్య ఏకంగా 3.5 లక్షలు దాటిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా జనం అంతా ఈమె గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు.
కోహ్లీపై క్రష్.. పాత జ్ఞాపకాలు వైరల్..
ఐరా ప్రొఫైల్ను పరిశీలిస్తే ఆమెకు క్రికెట్ అంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అంటే ఆమెకు అమితమైన ఇష్టంగా తన ప్రొఫైల్లో ఐరా పేర్కొంది. “అనుష్క శర్మతో పెళ్లికి ముందే నేను కోహ్లీని పెళ్లి చేసుకోవాలనుకున్నాను” అంటూ ఆమె గతంలో చేసిన ఒక ఫన్నీ కామెంట్ ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఒక సాధారణ ఫ్యాన్గర్ల్గా ఆమె పంచుకున్న పాత పోస్టులు ఇప్పుడు నెటిజన్లకు ఆసక్తికరంగా మారాయి. ఐరా ఫోటోలు వైరల్ అయిన తర్వాత ఇప్పుడు నెటిజన్లలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఆమె చూడటానికి “టూ పర్ఫెక్ట్” (చాలా అద్భుతంగా) కనిపిస్తుండటమే ఇందుకు కారణంగా చర్చించుకుంటున్నారు. ఆమె కళ్ళు, చర్మం, ఫోటోలలోని క్లారిటీ చూస్తుంటే ఆమె నిజమైన మనిషి కాదని, AI (Artificial Intelligence) ద్వారా సృష్టించిన క్యారెక్టర్ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమె పేరు ‘Airaawat’ లోని మొదటి రెండు అక్షరాలు ‘AI’ ని గమనించారా? ఇది కావాలనే పెట్టిన పేరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెను ఏఐ ద్వారా సృష్టించారని చెబుతున్నారు. అయితే ఆమె తన బయోలో తనను తాను ‘డిజిటల్ క్రియేటర్’ గా చెప్పుకుంటుంది. ఆమె ఫోటోలలోని లైటింగ్, ఫీచర్స్ సహజత్వానికి కాస్త దూరంగా, అత్యాధునిక AI టెక్నాలజీతో చేసినట్లుగా కనిపిస్తున్నాయి. నిజానికి ఐరా రావత్ నిజమైన మనిషి అయినా లేదా ఒక అద్భుతమైన AI సృష్టి అయినా, ఆమె సోషల్ మీడియాలో సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం వాస్తవం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ‘రీల్’ కి ‘రియల్’ కి మధ్య ఉన్న గీత చెరిగిపోతోందని చెప్పడానికి ఐరా రావత్ ఒక ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్ బ్యూటీస్ రెడీ