Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- Ai+ సంస్థ నుంచి కొత్త గాడ్జెట్ల లాంచ్
- PulseTab ట్యాబ్, NovaPod Beats
- NovaPods Air, RotateCam 4G విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai+ PulseTab, NovaPods, RotateCam Launch: నోవా (Nova) సిరీస్‌ను మరింత పెంచుతూ Ai+ కొత్త గాడ్జెట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లతో దూసుకెళ్తున్న ఈ బ్రాండ్, ఇప్పుడు ట్యాబ్లెట్, వైర్ లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తాజాగా Ai+ పల్స్ ట్యాబ్ (PulseTab), నోవాపాడ్ బీట్స్ (NovaPod Beats), నోవాపాడ్స్ ఎయిర్ (NovaPods Air), రొటేట్ క్యామ్ (RotateCam) 4G లులాంచ్ అయ్యాయి. మరి వీటి విశేషాలేంటో చూసేద్దామా..
పల్స్ ట్యాబ్ (PulseTab):
ఈ ట్యాబ్ 10.95 అంగుళాల ఫుల్ HD డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇందులో MediaTek Helio G88 ప్రాసెసర్ ను అందించారు. ఈ ట్యాబ్ లో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. దీన్ని 1TB వరకు విస్తరించుకోవచ్చు. అలాగే దీనికి 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక 8000mAh భారీ బ్యాటరీ, క్వాడ్ స్పీకర్లతో వినోదం, పనుల కోసం బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.
Also Read
- Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
- Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
- 6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
- బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!

బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!
నోవాపాడ్ బీట్స్ (NovaPod Beats):
ఈ నోవాపాడ్ బీట్స్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్‌లు 13mm డ్రైవర్‌తో మంచి సౌండ్ ను అందిస్తాయి. ఇందులో యాక్టీవ్ నాయిస్ కాన్సలేషన్ (ANC) సపోర్ట్ కూడా ఉంది. ప్రత్యేకంగా హార్ట్‌రేట్, SpO2 వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో ఇది వేగవంతమైన కనెక్షన్ కలిగి ఉంటుంది.

నోవాపాడ్స్ ఎయిర్ (NovaPods Air):
నోవాపాడ్స్ ఎయిర్ బడ్జెట్ సెగ్మెంట్లో బెస్ట్ ఆప్షన్. మొత్తం 22 గంటల ప్లేబ్యాక్ టైమ్, క్వాడ్ మైక్ ENC సపోర్ట్, 50ms లో లేటెన్సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. IPX5 రేటింగ్‌తో చెమట, నీటి చినుకుల నుంచి రక్షణ ఉంటుంది.
రొటేట్ క్యామ్ (RotateCam):
రొటేట్ క్యామ్ (RotateCam) స్మార్ట్ వాచ్ 180-డిగ్రీ రొటేటింగ్ కెమెరా కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఇది 4G LTE సిమ్ సపోర్ట్‌తో ఫోన్ లేకుండానే కాల్స్ చేసుకునే సౌకర్యం అందిస్తుంది. 2GB RAM, 16GB స్టోరేజ్, GPS, ప్లే స్టోర్ యాక్సెస్ వంటి ఫీచర్లతో ఇది పూర్తి స్థాయి స్మార్ట్ డివైస్ గా నిలుస్తోంది. ఇందులో 1520mAh బ్యాటరీ, IP68 రేటింగ్ కూడా ఉన్నాయి.

IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..
ధరలు:
ఈ కొత్త గాడ్జెట్ల ధరలు కూడా ప్రతి వినియోగదారుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. పల్స్ ట్యాబ్ ధర రూ.9,999 కాగా, నోవాపాడ్ బీట్స్ రూ.1,599, నోవాపాడ్స్ ఎయిర్ రూ.899, రొటేట్ క్యామ్ 4G రూ.4,999గా ఉన్నాయి. ఈ ఉత్పత్తులు మే 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..