పేర్నినాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం.. వినలేని విధంగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారు.