ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్‌ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ…