Today (25-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిపబ్లిక్ డే ముందస్తు జోష్ ఏమాత్రం కనిపించలేదు. నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు.. మార్కెట్ సెంటిమెంట్‌ను కుదిపేయడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు ఇవాళ బుధవారం విపరీతంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 850 పాయింట్లకు పైగా తగ్గిపోయింది. నిఫ్టీ.. బెంచ్ మార్క్ కన్నా దిగువకు పడిపోయింది. అయినప్పటికీ మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యూనీ లీవర్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు బాగా రాణించాయి.