Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది.