మేషం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వృషభం :- ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అడిట్, అక్కౌంట్స్ రంగాల…