UP Encounters: ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఎన్‌కౌంటర్లకు చిరునామాగా మారుతోంది. పేరు మోసిన నేరస్థులను మట్టుపెట్టడంలో యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 15,726 ఎన్‌కౌంటర్లు చేశారు. 256 మంది పేరుమోసిన నేరస్థులను హతమార్చారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్‌కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు.