నక్సలైట్లకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మన సైనికులు 'నక్సల్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు చనిపోయారని తెలిపారు.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు.