ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు…