వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్గానే సాగుతోంది.. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఐదో జాబితాపై ఫోక్ పెట్టింది.. ఐదవ జాబితాపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది.. ఇవాళ, రేపటిలోగా ఐదవ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది..
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది..
ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.