బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కాదు మోసం గ్యారెంటీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం చేపట్టామన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. గుడివాడలో కార్యక్రమానికి నాయకులను రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ హారికను పోలీసులు అడ్డుకున్నారన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాకి వైఎస్ జగన్ వస్తున్నారని సమాచారం తెలిసినప్పుడల్లా.. ఏదో ఒక దొంగ కేసు పెడుతున్నారు అని మండిపడ్డారు. 3వ తేదీ పీటీ వారెంట్ వేసి బయటికి తీసుకెళ్లినా.. జగన్ మాత్రం జిల్లాకి రావడం ఖాయం అని తేల్చి చెప్పారు.
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లిందని..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా?…
మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు.
Avinash Reddy: కడప జిల్లాలో మహానాడు అంటూ టీడీపీ పైశాచిక ఆనందం పొందుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా అన్ని స్థానాల్లో ఓటమి తప్పదని ఆయన జోష్యం చెప్పారు. పులివెందులలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు, తోరణాలు కట్టడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంతం ప్రజల ఎమోషన్ వైయస్సార్ అని, ఆయన విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యతా అంటూ ప్రశ్నించారు. Read Also: IPL…