Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో హేమాహేమీల్లాంటి నాయకులున్నారు. అధికారం, ప్రతిపక్షం అన్నదాంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఛరిష్మాతో రాజకీయాలు నడపగల సామర్ధ్యం ఉన్నవాళ్ళే. కానీ…. ఇప్పుడు అలాంటి నేతలంతా ఏమైపోయారు? ఎక్కడున్నారంటూ పార్టీ కేడర్ భూతద్దం పట్టుకుని వెదుకుతోందట. ప్రతిపక్షంలో ఉండి… అంతా కలిసి పనిచేయాల్సిన టైంలో సీనియర్ నాయకులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారన్నది వాళ్ళ ప్రశ్న. పరిణితితో ఆలోచించాల్సిన నేతలే గిరి గీసుకుని కూర్చుంటున్నారని, దానివల్ల జిల్లాలో పార్టీకి దిశా నిర్దేశం…