విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది.. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ…