ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాటే. ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఉండటం, పార్టీ ఇంచార్జ్ గా ఎవరు వచ్చినా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో, మిగిలిన వారు వైరి వర్గంగానే ఉండాల్సి వస్తోందట. నిన్నటి వరకూ ఆ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా మాదాసి వెంకయ్య బాధ్యతలు చూశారు. స్వతహగా డాక్టర్ అయిన వెంకయ్య 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి కొండేపి టిక్కెట్…