ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో అనంతబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులుతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు…