కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్… ఇప్పటికే పలు పథకాలకు సంబంధించిన సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం.. రేపు వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేయడానికి పూనుకుంది.. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేల చొప్పున వేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.192.08 కోట్లు వేయనున్నారు సీఎం…