Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి విడదల రజినీ ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆయుష్…
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్‌ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్‌సీ,…