ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది.
100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపదా రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది అని అన్నారు సీఎం జగన్. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చాం. అలాగే ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను పెంచాం. నా పాదయాత్రలో అనేక కథలు విన్నాను, చూశాను కూడా. అందుకే మేనిఫోస్టోలో ఈ అంశాన్ని పెట్టాం అని పేర్కొన్నారు. దాదాపు 1.30 లక్షల కుటుంబాలు వైయస్సార్ భీమా పరిధిలోకి…