మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రోజాకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని.. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
యుద్ధం మొదలైంది.. ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్ పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే…
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి రెండ్రోజులపాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యి.. ఆయన భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నాం కల్లా పులివెందుల పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారాయన.
AP CM Jagan London Tour: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత కుటుంభ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక రెండు వారలు లండన్ టూర్ విజయవంతంగా ముగించుకుని విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న సీఎం జగన్ కు ఘనస్వాగతం చెప్పిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.. మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కనుండగా మళ్ళి తమ పార్టీనే అధికారంలోకి వస్తుంది…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు. అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో…
ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రభుత్వం సమ్మెకి దిగే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చూస్తుంటే… ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీడీవోలు, ట్రెజరీ అధికారుల ద్వారా కొత్త జీతాల ప్రక్రియ చేపట్టింది. అయితే తమ ఉద్యమం ఆగదని, పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో…