డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వివరాలను తెలిపారు. పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరామని ఆమె వెల్లడించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు.