గుడివాడ అమర్నాథ్... ఏపీ మాజీమంత్రి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయత ముద్ర ఉన్న నాయకుడు. అప్పుడు మంత్రి పదవికైనా, ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా... ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం. అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ... పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా... ఏ పదవులు నిర్వహించినా... ఈ మాజీ మంత్రికి ఓ కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయిందన్న అసంతృప్తి మాత్రం ఉందట ఆయనకు. గత…
ఏపీలో సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్‌కు 2024 ఎన్నికల ముందు ఉన్నట్టుండి ఖద్దరు మీద మోజు పెరిగింది. ఎన్నాళ్ళని వాళ్ళకి వీళ్ళకి సలాం కొడతాం.... అదేదో... మనమే కొట్టించుకుంటే పోలా... అంటూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. తాను చేస్తున్న అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఒక్కటంటే.. ఒక్కరోజులోనే రాజీనామా చేసేసి... కేవలం ఒక్క పూటలోనే ఓకే స్టాంప్ వేయించుకున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం (డిసెంబర్ 18) కర్నూలుకు రానున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి.. 11.55 గంటలకు కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్స్ హెలిపాడ్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బళ్లారి చౌరస్తా మీదుగా కర్నూలు నగర శివారులో ఉన్న జీఆర్సీ…
గ్రంధి శ్రీనివాస్.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, కాపుసామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఒకసారి, జగన్ హయాంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. మేటర్ ఏదైనాసరే...సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే గ్రంధి 2019లో పవన్ కళ్యాన్‌ను ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. దాంతో వైసీపీలో గ్రంధి పొలిటికల్ కెరీర్‌కు ఇక తిరుగే ఉండదనుకున్నారు అప్పట్లో. సీన్ కట్ చేస్తే... 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరం జరిగిన గ్రంధి శ్రీనివాస్…
మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని.
మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు... ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించామన్న ఆయన.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని వెల్లడించారు.
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో చెంచల్ గూడా జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు14…
ఆంధ్రప్రదేశ్‌లో పోరుబాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, అందులో భాగంగా.. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ.. రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పెట్టుబడి, గిట్టుబాటు ధర.. ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా…