YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మోంథా తుపాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ (మంగళవారం) నాడు పర్యటించనున్నారు. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు, వారికి అండగా నిలబడేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. వైయస్ జగన్ పర్యటన కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైయస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని,…
YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
YS Jagan : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు పరిపాలన వైఫల్యమే కారణమని ఆయన ఎక్స్లో ఘాటుగా వ్యాఖ్యానించారు. “ప్రతిరోజూ పరిపాలనలో తనను మించిన వారు లేరని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు… వాస్తవానికి పరిపాలనలో ఘోర వైఫల్యాలు చేస్తున్నారని” జగన్ ఎద్దేవా చేశారు. “కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలోని పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను…
అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు.
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బలం ఉన్న చోట కూడా దాన్ని చాటుకోలేకపోతున్నామంటూ జిల్లా నేతల మీద కేడర్లో అసహనం పెరిగిపోతోందట. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతోపాటు గుంటూరు కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకుంది. అటు ఎంపీటీసీ, జడ్పీటీసీలదీ అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉంటే… అందులో 46 డివిజన్స్ని దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా…
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల…
YS Jagan: మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Off The Record: పెనమలూరు పేచీలు కృష్ణా జిల్లా వైసీపీని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకత్వం తీసుకున్న ఓ నిర్ణయం నియోజకవర్గంలో వర్గపోరుకు బీజం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరో వస్తారని అంచనా వేస్తున్న ఓ వర్గం… ఇప్పుడున్న ఇన్ఛార్జ్కి సహాయ నిరాకరణ మొదలుపెట్టేసిందట. దీంతో కొత్త గొడవలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి పార్థసారధి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ…2024 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి…
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. బస్సు ప్రమాదంపై కూడా కొన్ని చానళ్లు శవరాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. పింక్ డైమండ్, నారా రక్త చరిత్ర, మామిడి కాయల స్టోరీ.. ఇలా ఫేక్ రాజకీయాలు చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దిట్ట…
Former CM YS Jagan: రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు.. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు.. వాళ్ళ మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి.. వాళ్ళు ఎలా నడుపుతున్నారు అందరూ చూస్తున్నారన్నారు.. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని.. బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్…