Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.
YS Jagan: కృష్ణలంకలోని గల నిర్మలా శిశు భవన్ లో దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలిని కారు ఆపి స్వయంగా పలకరించారు. అంతేకాదు సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా తన పార్టీ నాయకుడికి అప్పగించారు. జగన్ ఆదేశాల మేరకు ఆ నాయకుడు స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. దగ్గరుండి మరి వైద్యం అందించారు. అంతేకాదు వృద్ధురాలికి డబ్బు సహాయం కూడా అందించారు. Also Read: Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్…
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.
YS Avinash Reddy: తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు.. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు.. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని థియేటర్లపై విచారణ చేస్తున్నారు.. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ చేస్తామని నిర్ణయం తీసుకుంటే.. ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు.. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ గురించి తెలీదు అన్నారు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు అని పేర్నినాని సెటైర్లు వేశారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.
కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు.
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవబోతున్నారంటూ... జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలు... జగన్ కుడి, ఎడమలుగా చెప్పుకునే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకూ వచ్చింది అరెస్ట్‌ల పర్వం. ఇప్పటిదాకా ఏడుగురు అరెస్ట్ అవగా... దాదాపు అందరి విషయంలో ముందు లీకులు రావడం, తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే... ఇంకేముంది రేపో మాపో జగన్ కూడా లోపలికి వెళ్ళడం ఖాయమంటూ టీడీపీ…