కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారన్నారు.. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని.. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రావాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరన్నారు.. ఇక, వైఎస్ షర్మిల.. ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా…? తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు..? అని…