హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
Honda Dio: కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త 2025 హోండా డియో ఫీచర్లు, ధరల వివరాలను వివరంగా చూద్దాం. Also Read: Australian Open…