Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్,…
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే..…
తెలంగాణలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆకర్షితులవుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే, పెద్ద మొత్తంలో నష్టపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.
Online Betting Suicide: ఈ మధ్యకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు…