Bharath Future City: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నేడు మొదటి పునాది రాయి చేశారు. ఈ నగర నిర్మాణానికి తొలి అడుగుగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనిని 7.29 ఎకరాల స్థలంలో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 కోట్ల వ్యయంతో నాలుగు నెలల్లో పూర్తి కానుంది.…
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే…
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించామని, నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక వసతులు కల్పించాలన్నారు. అందుకే శాసనసభలో బిల్లును ఆమోదించి ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్,…