లేడీ సూపర్ స్టార్ సమంతా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ‘ఏలేలో ఏలేలో’ అనే సాంగ్ బయటకి వచ్చింది. శకుంతల, దుష్యంతుడిని కలవడానికి పడవలో వెళ్లే సమయంలో ఈ పాట వచ్చేలా ఉంది. ఇందులో పడవ నడిపే వ్యక్తిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఈయన…