MP Mithun Reddy: ఏపీ లిక్కర్ కేసులో A-4గా ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. దీంతో పాటు రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, వారంలో రెండుసార్లు సంతకాలు చేయాలని పేర్కొనింది. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి.. రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
అయితే, లిక్కర్ కుంభకోణంలో ఈ ఏడాది జులై 19వ తేదీన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా.. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి అయ్యాయి. ఇక, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.