వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజనల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.