పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైసీపీ ఇంఛార్జి కొండారెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులివెందుల-రాయచోటి మధ్య రోడ్డు పనులను కొండారెడ్డి అడ్డుకున్నారని.. చక్రాయపేట మండలంలో పనులు జరగాలంటే తనకు డబ్బులివ్వాలని బెదిరించారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు కన్‌స్ట్రక్షన్ సంస్థ కర్ణాటకలోని ఓ బీజేపీ…