Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు.
KCR Health News: ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారి పడిన కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలి ఎముక విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎముకను మార్చారు.
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ ను యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కత్తి గాయాలతో కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఆస్పత్రికి తీసుకొచ్చారు..CT స్కాన్ చేశాం.. చిన్న పేగుకి 4 చోట్ల రంధ్రాలు పడ్డాయి.. చిన్న పేగు 15 సెంటీ మీటర్ల మేర కట్ చేసి సర్జరీ చేశామని డాక్టర్లు వెల్లడించారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు.
YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. Read…
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద…
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే అనారోగ్యం వల్ల ఆయన పర్యటన రద్దయింది.ఇటీవల కాలంలో ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఈమధ్యకాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారు. అస్వస్థత కారణంగా యాదాద్రికి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి వుంది. కానీ పర్యటన రద్దు చేశారు. ముఖ్యమంత్రి…
సీఎం కేసీఆర్ కి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో…