Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress senior leader jana reddy admitted in yashoda hospital: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మోకాలికి చికిత్స సమయంలో వివిధ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో జానా రెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డికి నిన్న రాత్రి వైద్యులు స్టంట్ చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆరోగ్యం పట్ల భయపడవలసిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. జానారెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు భయాందోలనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.
Read also: SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో జానా రెడ్డి పాల్గొన్నారు. జానా రెడ్డి సీఎం పదవి మినహా అన్ని రకాల మంత్రి పదవులు చేపట్టారు. 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. నోముల నరసింహయ్య మరణం తర్వాత నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేశారు. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జానారెడ్డి మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కీలక నేతలు వచ్చినప్పుడు నిర్వహించే సమావేశాలకు హాజరవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానా రెడ్డి తనయుడు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో జానా రెడ్డి, ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!