Yamuna River: ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది. కార్తీక మాసం సందర్బంగా ఉదయం భక్తులు యమునా నదిలోకి దిగి సంప్రదాయ పూజలు చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ నదిలో వ్యాపించిన నురుగు ఈ పండుగను ఆందోళనల మబ్బులో పడేసింది. తాజాగా డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో, నదిపై ముదురు తెల్లని నురుగు తేలుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ విషపు నురుగు మధ్య భక్తులు పూజలు చేశారు. ఇది వారి ఆరోగ్యానికి ప్రమాదాన్ని సూచిస్తుంది.
Read Also: Lightning In Football Match: లైవ్ మ్యాచ్‌లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి (వీడియో)
నదిలో కాలుష్యం దృశ్యం నీటి నాణ్యతను హైలైట్ చేయడమే కాకుండా.. అనేక రకాల రసాయన మూలకాలు, పారిశ్రామిక వ్యర్థాల కరిగిపోవడాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఇవి కాలక్రమేణా ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో యమునా నదిలో ఈ రకమైన కాలుష్యం ఏర్పడడం ప్రభుత్వానికి, స్థానిక పరిపాలనకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా పూజ సమయంలో భక్తులు నదిలో స్నానం చేయడం పాత సంప్రదాయం. అయితే యమునా నది కాలుష్యం ఈ పరిస్థితిని చూస్తుంటే, నది పరిశుభ్రతను నిర్ధారించడానికి పరిపాలన తగిన చర్యలు చేపట్టిందా అనే ప్రశ్న తలెత్తుతుంది. యమునా నదిలో గాఢమైన నురగతో భక్తులు స్నానాలు చేయడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యం, పర్యావరణం పట్ల పరిపాలనా ప్రయత్నాలపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది.
Read Also: Astronauts Returned To Earth: 192 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు