ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా దేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ బైక్ యమహా FZ-S Fi హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన రెండవ హైబ్రిడ్ బైక్‌ను తీసుకువచ్చింది. యమహా FZ‑X హైబ్రిడ్ పేరిట రిలీజ్ చేసింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీని దాని నియో-రెట్రో స్ట్రీట్ బైక్‌కు పరిచయం చేసింది. ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కొత్త FZ-X కలర్ TFT మీటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా టెక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.…