నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత,…
యాదాద్రి ఆలయంలో పునర్‌ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించలేదు అధికారులు.. ఎవ్వరైనా భక్తులు కొండపైకి చేరుకోవాలంటే.. ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించారు.. లేదా మెట్ల మార్గంలో కూడా కొండపైకి చేరుకోవచ్చు.. అయితే, మే 1వ తేదీ (రేపటి) నుంచి యాదగిరిగుట్టపైకి ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించనున్నారు.. ఇదే, సమయంలో భక్తులకు షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకున్నారు యాదాద్రి ఆలయ అధికారులు.. కొండపైకి అనుమతించే వాహనాలకు భారీగా పార్కింగ్ రుసుం వసూలు చేయనున్నారు.. కొండపైకి…
దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్నఆలయం అభివృద్ధిదిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దిన అనంతరం అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు.. తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మరికొన్ని దేవాలయాల అభివృద్ధిపై దృష్టిసారించారు సియం కేసీఆర్.. అందులో భాగంగా వేములవాడలో కొలువున్న శ్రీరాజరాజేశ్వరస్వామి…
గోదావరి నీళ్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి పాదాలు కడగాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి యాదాద్రికి అధికారులు నీరు విడుదల చేశారు. ఈ మేరకు ఆఫ్టేక్-2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. అటు నుంచి ఈ గోదావరి జలాలు యాదాద్రి నారసింహుడి చెంతకు చేరాయి. యాదాద్రి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమైన రోజే గండి చెరువును అధికారులు కాళేశ్వరం నీటితో నింపారు.…
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేశారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహణ వుంటుందని అంటున్నారు.…
యాదాద్రిలో ఇక స్వామివారి సేవలు మరింత ప్రియం కానున్నాయి… లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచేశారు… లక్ష్మీనరసింహస్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజల టిక్కెట్ల ధరలను ఏకంగా 50 శాతానికి పైగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ అధికారులు… ఇక, తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న ధరలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.. యాదాద్రిలో భక్తులు మొక్కు, శాశ్వత కైంకర్యాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ కాగా.. పెరిగిపోతోన్న ధరలు, ఉద్యోగులు…