వినూత్నంగా రూపుదిద్దుకున్న తెలంగాణ తిరుపతి యాదాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రికి వెళ్ళే భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండ పైకి యాదాద్రిదర్శిని పేరుతో బస్సులు ఏర్పాటుచేశారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు సెస్ చార్జీలు మాత్రమే పెంచాం.…