తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన…