స్మార్ట్ గాడ్జెట్స్ అందించే బెనిఫిట్స్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. సరికొత్త గాడ్జెట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ పిల్లల కోసం కొత్త Xiaomi కిడ్స్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్ డ్యూయల్ కెమెరా డిజైన్, AMOLED డిస్ప్లే, అధునాతన లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ వాచ్ పిల్లల భద్రత, కమ్యూనికేషన్, రోజువారీ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది AI- ఆధారిత ఫ్లోర్-లెవల్ GPS మద్దతును కలిగి ఉంది.…