Today Business Headlines 29-03-23: కొత్త యాక్టివా లాంఛ్: యాక్టివాలో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేట్ చేసిన ఇంజన్‌తో దీన్ని రూపొందించినట్లు హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది. ఏప్రిల్ నుంచి కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో.. వాటికి అనుగుణంగా నయా యాక్టివాను తయారుచేశామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించామని వెల్లడించింది.