టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆశలు రేపుతున్నారు. 53 కేజీల మహిళా విభాగంలో ఇండియా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ను 7-1 తేడాతో ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిపత్యం సాధించింది. వీలైనంత వరకూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మొదటి పిరియడ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్, రెండో పీరియడ్‌లో 2 స్కోర్ మాత్రమే చేసింది. అయితే, స్వీడన్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయంట్…