ఆరుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆయన విచారణను ఎదుర్కోవచ్చని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.