మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి. ఈసారి వేలంలో హీథర్ నైట్,…